మోడీ ముందు జగన్ పెట్టిన అభ్యర్ధన ఇదే…!

-

దేశ వ్యాప్తంగా ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. పరిస్థితి ఇప్పుడు క్రమంగా ఆందోళనకరంగా మారుతుంది. దీనిపై కేంద్రం కూడా కాస్త కంగారు పడుతుంది. అందుకే లాక్ డౌన్ విషయంలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు మోడీ.

ఇది పక్కన పెడితే ఆయన తాజాగా ముఖ్యమంత్రులు అందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్… ప్రధాని ముందు ఒక అభ్యర్ధన పెట్టారు. రెడ్‌ జోన్ల వరకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని ఆయన మోడిని కోరారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని వివరించిన జగన్… రాష్ట్రంలో 676 మండలాల్లో 81 మండలాలను కరోనా ప్రభావిత మండలాలుగా గుర్తించామని మోడికి చెప్పారు.

ఈ మండలాల్లోనే లాక్‌డౌన్‌ కొనసాగించాలని, జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సినిమా హాళ్లు, మాల్స్‌, పాఠశాలలు యథావిథిగా మూసివేయవచ్చని జగన్‌ తన అభిప్రాయాన్ని చెప్పారు. దీనిపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు రెడ్ జోన్ లో లాక్ డౌన్ లేకపోతే కరోనా లక్షణాలు బయటపడేది 14 రోజుల తర్వాత కాబట్టి ప్రమాదం వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news