మ‌న దేశంలో అత్యంత ధ‌నిక గ్రామం ఇదే.. 17 బ్యాంకుల్లో రూ.5వేల కోట్ల డిపాజిట్లు..

-

మ‌న దేశంలో ప్ర‌తి ప్రాంతం నుంచి ఎంతో కొంత మంది విదేశాల‌కు వెళ్తుంటారు. కొంద‌రు అక్క‌డే స్థిర ప‌డుతుంటారు. కొంద‌రు మాత్రం కొన్నేళ్ల పాటు విదేశాల్లో ఉండి సంపాదించుకుని తిరిగి సొంత దేశాల‌కు వ‌స్తుంటారు. అయితే ఆ గ్రామానికి చెందిన వారు కూడా అలాగే విదేశాల‌కు వెళ్లారు. కానీ వారు అక్క‌డితో ఆగ‌లేదు. త‌మ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నారు. దీంతో ఆ గ్రామం ఇప్పుడు బ్యాంకు డిపాజిట్ల ప‌రంగా దేశంలోనే అత్యంత ధనిక గ్రామంగా ఆవిర్భ‌వించింది. అదే.. గుజ‌రాత్‌లోని క‌చ్ జిల్లాలో ఉన్న మాదాపార్ గ్రామం.

ఈ గ్రామంలో దాదాపుగా 7600 ఇళ్లు ఉంటాయి. అయితే ఈ గ్రామ వాసులు కొంద‌రు లండ‌న్‌కు వెళ్లారు. అక్క‌డ వారు త‌మ గ్రామం పేరిట ఓ అసోసియేష‌న్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తిరిగి అదే అసోసియేష‌న్‌ను ఆ గ్రామంలోనూ ప్రారంభించారు. దీంతో ఆ గ్రామం నుంచి లండ‌న్ లో ఉన్న ఆ గ్రామ వాసుల‌కు నేరుగా క‌నెక్టివిటీ ఏర్ప‌డింది. అలా వారు అక్క‌డి నుంచే త‌మ గ్రామాన్ని అభివృద్ది చేసుకున్నారు. దీంతో ఆ గ్రామం ఇప్పుడు దేశంలోనే బ్యాంకు డిపాజిట్ల ప‌రంగా అత్యంత సంప‌న్న‌మైన గ్రామంగా మారింది.

ఆ గ్రామంలో 17 బ్యాంకులు ఉన్నాయి. వాటిల్లో లండ‌న్‌లో ఉన్న‌వారు సొమ్మును డిపాజిట్ చేస్తుంటారు. దీంతో ఆ మొత్తం ఇప్పుడు రూ.5000 కోట్ల‌కు పైగానే అయింది. ఈ క్ర‌మంలోనే ఆ గ్రామం ధ‌నిక గ్రామంగా పేరుగాంచింది. అక్క‌డ అనేక స్కూళ్లు, కాలేజీలు ఉన్నాయి. అత్యాధునిక వ‌స‌తుల‌తో కూడిన గోశాల కూడా ఉంది. ఆ గ్రామ వాసులు ఎక్కువ‌గా వ్య‌వ‌సాయం చేస్తారు. వారికి విదేశాల్లో ఉన్న త‌మ గ్రామ వాసులు పూర్తిగా స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తారు. అందుక‌నే ఆ గ్రామం ప్ర‌గ‌తి దిశ‌గా దూసుకుపోతోంది. ఇలా ప్ర‌తి గ్రామంలోనూ ఆ గ్రామానికి చెందిన వారు చేస్తే అప్పుడు దేశంలో అన్నీ సంప‌న్న గ్రామాలే ఉంటాయి. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, ఆక‌లి చావులు ఉండ‌వు.

Read more RELATED
Recommended to you

Exit mobile version