హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో సంక్రాతి ఒకటి. ఈ పండుగని నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. వీటిలో మొదటి రోజు భోగి. భోగి రోజు సాయంత్రం చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. అసలు భోగి పళ్ళు పిల్లలకి పొసే పద్ధతి చాలా మందికి తెలియదు. మరి ఆ పద్ధతి గురించి చూస్తే… భోగి పళ్ళు పొయ్యడానికి కూడా ఒక పద్ధతి ఉంది. పిల్లలకి భోగి పళ్ళు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి. అయితే అసలు పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు..? అనే విషయం లోకి వస్తే… పసి పిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తం తీసి భోగి పళ్ళు పోయడం జరుగుతుంది.
సాయంత్రం సంధి వేళ గొబ్బెమ్మలు పిల్లల చేత పెట్టించిన తర్వాత ఈ భోగి పళ్ళ కార్యక్రమం మొదలు పెడతారు. ఐదేళ్ల లోపు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. రేగిపళ్ళు, బంతిపూలు రేఖలు, చిల్లర నాణాలు, చెరుకుగడల ముక్కలు కలిపి ఉంచుతారు. వాటిని పిల్లాడు పై పడేటట్టు పోస్తారు అలా పోసిన తర్వాత కింద పడ్డ రేగుపళ్ళు తినడం నిషిద్ధం.
దాన్ని ఎవరూ లేని చోట పారేయడం చేస్తారు. అసలు పిల్లలకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అనే విషయానికి వస్తే… రేగి పండును అర్క ఫలం అని అంటారు. అర్హుడు అంటే సూర్యుడు. భోగి మర్నాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణ వైపు మళ్లుతాడు. అందుకే ఆయన కరుణ కటాక్షాలు పిల్లల పై ఉండాలని ఉద్దేశం తో పిల్లలకు భోగి పళ్లు పోస్తారు.