ప్రస్తుతం అన్లాక్ 5.0 లో భాగంగా కేంద్రం కీలక మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక అన్లాక్ 5.0 లో భాగంగా దాదాపుగా అన్ని రకాల కార్యకలాపాలు మొదలయ్యాయి అని చెప్పాలి. ముఖ్యంగా సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా థియేటర్ల పునః ప్రారంభానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది . కానీ కేవలం 50 శాతం సామర్థ్యంతో మాత్రమే సినిమా థియేటర్లను నిర్వహించాలని నిబంధనలు పెట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తి దృశ్యా ఆయా సినిమా థియేటర్ల నిర్వాహకుల కఠిన నిబంధనల మధ్య సినిమాలు ఆడించేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పివిఆర్ సినిమాస్ సీఈవో కమల్ జ్ఞాన్ చెందాని.. సినిమా చూసేటప్పుడు ప్రతి ప్రేక్షకుడడు మాస్క్ ధరించడం తప్పనిసరి అనే నిబంధన పెట్టారు. తినేటప్పుడు మాస్క్ అవసరం లేదని.. కానీ టికెట్లు తీసుకునేటప్పుడు ఇతర పానీయాలు తీసుకునేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని సూచించారు. మాస్క్ ధరించకపోతే సినిమా హాల్లోకి అనుమతించబోమని అంటూ స్పష్టం చేశారు.