ఈ మధ్యకాలంలో పిల్లలు స్మార్ట్ ఫోన్ మొదలైన ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ కి అలవాటు పడిపోతున్నారు. నిజంగా అది చాలా బ్యాడ్ హేబిట్. ఎక్కువ సేపు వీటి ముందే సమయాన్ని గడపడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కంటిచూపు కూడా దెబ్బ తింటుంది. ఏదిఏమైనా తల్లిదండ్రులు పిల్లల్ని వాటి నుండి దూరంగా ఉంచాలి లేదు అంటే పిల్లల్లో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అయితే ఎలా వాటి నుండి దూరంగా ఉంచవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం మరి ఇక ఆలస్యం ఎందుకు దీనికోసం పూర్తిగా చూసేయండి.
బోర్డ్ గేమ్స్:
పిల్లలు ఆడడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కార్డ్ గేమ్స్ కానీ వివిధ రకాల బోర్డ్ గేమ్స్ కానీ వాళ్లతో ఆడుతూ ఉంటే వాళ్లు ఈ స్క్రీన్స్ నుండి దూరంగా ఉండడానికి వీలు అవుతుంది.
ఆర్ట్ :
కాగితంతో కానీ మట్టితో కానీ లేదా డ్రాయింగ్ వంటివి కానీ వాళ్ళకి అలవాటు చేయండి. మండాలా ఆర్ట్ వంటివి కూడా వాళ్ళకి నేర్పించండి ఇలా ఈ విధంగా వాళ్లకి నేర్పి స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉంచచ్చు.
పజిల్స్:
పిల్లలే కాదు ప్రతి ఒక్కరు కూడా పజిల్స్ అంటే ఇష్టపడతారు వీటి కోసం మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఆన్లైన్లో మనం చూసి వాళ్ళకి చెప్పొచ్చు.
వంట చేయడం:
వాళ్లకి కాస్త వంట నేర్పడం.. వాళ్లతో చిన్న చిన్న వంటలు చేయించడం కూడా చేయొచ్చు నిమ్మకాయ నీళ్లు కలపడం, చపాతి ఒత్తడం ఇలా స్టవ్ కి దూరంగా ఉండే వాటిని వాళ్ళకి చెప్పచ్చు.
డాన్సింగ్:
డాన్స్ చేయడం, కాస్త ఎక్సర్సైజ్ చేయడం లాంటివి కూడా చాలా మంచిది.
చదివించడం:
కథల పుస్తకాలు మొదలైన ఆసక్తికరమైన పుస్తకాలు చదవడం వల్ల వాళ్ళు స్మార్ట్ఫోన్ వంటి వాటికి దూరంగా ఉండగలరు. ఇలా ఈ విధంగా వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్లతో ఇలా రోజును గడిపితే ఎలక్ట్రానిక్ డివైస్లకి దూరంగా ఉంటారు.