ఆ హీరో అభిమానులు ఇప్పటికీ కోపంగానే ఉన్నారు.. రాహుల్ రవీంద్రన్.

-

అందాల రాక్షసి సినిమాతో హీరోగా తెలుగు తెరకి పరిచయమైన హీరో రాహుల్ రవీంద్రన్, సడెన్ గా చిలసౌ సినిమాతో దర్శకుడిగా మారాడు. సుశాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకి విమర్శకుల నుండి ప్రశంసలు రావడంతో పాటు స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు రాహుల్. ఐతే ఆ తర్వాత నాగార్జునతో మన్మధుడు 2 సినిమా తీసాడు. ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో నాగార్జున అభిమానులు రాహుల్ పై కోపంగా ఉన్నారు.

సినిమా వచ్చి చాలా రోజులవుతున్నా ఆ కోపం ఇంకా తగ్గలేదని రాహుల్ అంటున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో ముచ్చటించిన రాహుల్, నాగార్జునతో మళ్ళీ సినిమా ఎప్పుడుంటుందని అడగ్గా, ఇప్పట్లో ఉండబోదని, మన్మధుడు 2వల్ల నాగార్జున అభిమానులు కోపంగా ఉన్నారని, కొన్ని రోజుల తర్వాత కుదిరితే చూస్తానని తెలిపాడూ. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన తన మూడవ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో నిర్మిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై తానింకా స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version