సుకుమార్ మామూలు ప్లాన్ వేయలేదుగా!

-

అలలు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రం పుష్ప తెరకెక్కుతుందనగానే సినిమా అభిమానులందరిలో ఒక అటెన్షన్ ఏర్పడింది. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యాక అది మరింత పెరిగింది. లారీ డ్రైవర్ గా కనిపించబోతున్న అల్లు అర్జున్ మేకోవర్ చూసి అందరూ షాకయ్యారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఐతే మధ్యలో పుష్ప సినిమాలో విలన్ ఎవరనే విషయమై చాలా రోజులుగా కన్ఫ్యూజన్ కొనసాగింది. విజయ్ సేతుపతి తప్పుకున్నాడని తెలిసినప్పటి నుండి ఆ స్థానంలో ఎవరొస్తున్నారనే విషయంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసారు.

తాజాగా మళయాల నటుడు ఫాహద్ ఫాజిల్ ని విలన్ తీసుకుని అందరూ ఆశ్చర్యపోయేలా చేసాడు సుకుమార్. మళయాళ నటుడైన ఫాహద్ కి కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది. అటు అల్లు అర్జున్ కి మళయాలంలో ఫాలోయింగ్ ఎక్కువే. ఇలా ఇద్దరు హీరోల మార్కెట్ తో అక్కడ మరింత రేంజ్ పెరిగే అవకాశం ఉంది. పాన్ ఇండియా రేంజ్ సినిమాగా రూపొందుతున్న పుష్పకి ఫాహద్ ని విలన్ గా పెట్టి మరోసారి ఆసక్తిని ఆకాశానికెత్తేసాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version