వాహ్‌..ఆ గ్రామాల్లో నేటి వరకు ఒక్క కరోనా కేసూ లేదు!

-

సెకండ్‌ వేవ్‌ కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. దేశవ్యాప్తంగా ఈ వైరస్‌ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామాలు మాత్రం ఒక్క కేసు కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన కొడిమ్యల్‌ బ్లాక్‌కు చెందిన చిన్న గ్రామం దమ్మయ్యపేట. ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా కొవిడ్‌ బారిన పడలేదు. ఈ గ్రామం ప్రధాన రోడ్డు కంటే కిందికి, చుట్టూ కొండలు ఉన్నాయి. దాదాపు 293 ఇళ్లు, 1,144 మంది జనాభా ఉంది. అయినా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ ఊర్లో ఉన్న చాలా మంది యువత చదువుకున్నవారు. ఈ విషయాన్ని దమ్మయ్యపేట సర్పంచ్‌ తునికి నర్సయ్య ఒక వార్త పత్రికకుతెలిపారు.

2020 దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా స్తంభించిపోయింది. ఆ సమయంలో గ్రామస్థులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నరట. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. దానికి సంబంధించిన ఆదేశాలను కూడా జారీ చేశారు. దాన్ని పాటించినందుకే నేటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని సర్పంచ్‌ నర్సయ్య తెలిపారు.
ఈ ఊళ్లో ఇళ్లులు కూడా శతాబ్దల కిందట పెక్యూలియర్‌ ప్యాటర్న్‌లో నిర్మించిన నమూన కలిగి ఉన్నవి. ప్రతి ఇంటికి కనీసం 10 మీటర్ల దూరం ఉంది. దీనివల్ల ప్రజలంతా సోషల్‌ డిస్టేన్స్‌ పాటించడానికి వీలుపడింది. అందరూ కచ్చితంగా మాస్కులు పెట్టుకుంటారని సర్పంచ్‌ వార్త పత్రికకు చెప్పారు. అదేవిధంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం గుంపులుగా గుమిగూడటం, వేడుకలు చేసుకోవడం దమ్మయ్యపేటలో చేసుకోవడం మానేసారు. ఇది గ్రామస్థులంతా తీసుకున్న మూకుమ్మడి నిర్ణయం. పెళ్లిలు జరిగినా వేడుకకు కేవలం పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇరు కుటుంబలు మాత్రమే హాజరయ్యేవారు. గతంలో మాదిరిగా స్నేహితులను, చుట్టాలను పెళ్లిల్లకు పిలవడం మానేశామని గ్రామానికి చెందిన యువకుడు కే సుధాకర్‌ అంటున్నాడు. గ్రామ పంచాయతీ అధికారులు గ్రామమంతా ప్రతి మూడు రోజులకు ఒకసారి సోడియం హైపోకోరైడ్‌ పిచికారీ చేయించేవారు. బయట వ్యక్తులు సరైన రిజన్‌ లేనిదే గ్రామంలోనికి రానివ్వం. అలాగే వారికి కొవిడ్‌ లక్షణాలు లేకుంటేనే, వారు నెగిటివ్‌ సర్టిఫికేట్‌ చూపిస్తేనే అనుమతించే వాళ్లమని సర్పంచ్‌ తెలిపారు. ఊళ్లో ఉండే వ్యక్తులు రూ. 200–250 కు మహాత్మా గాంధీ నేషనల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కింద పనికి వెళ్లే కూలీలే ఉన్నారు. పనివద్ద కూడా కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించేవారు.
మరోగ్రామం జగన్మాధపురం రాయికల్‌ బ్లాక్‌కు చెందింది. ఈ గ్రామస్థులు గోండు తెగకు చెందినవారు. వీళ్లు కూడా కరోనా నిబంధనలను పాటిస్తున్నారు. జనాభా కూడా వేయిపైగా ఉంది. వీరిలో ఒక్కరికి కూడా పాజిటివ్‌ లేదు. ఈ గ్రామస్థులు కూడా మూకుమ్మడి నిర్ణయం తీసుకుని దాన్ని పాటించడమే వారు ఈ విజయం సాధించమని సర్పంచ్‌ విజయ్‌ తెలిపారు. పుప్పాలకు చెందిన మెడికల్‌ ఆఫీసర్‌ కూడా తరచూ గ్రామాన్ని పరిశీలించేవారు. ఆయన మాట్లడుతూ ఈ గ్రామంలో స్ట్రిక్ట్‌గా కరోనా నిబంధనలు పాటిస్తారు. ఇది పట్టణ ప్రజల్లో ఈ స్పృహా లేకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని చెప్రారు.
అలాగే నిర్మల్‌ జిల్లాకు చెందిన మరో మూడు గ్రామాలు కూడా కరోనాకు దూరంగా ఉన్నాయి. అవి పెంటదారి, ఇప్పచర్మి, సారంగపూర్‌ బ్లాక్‌కు చెందిన లక్ష్మీ నగర్‌. జనగాం జిల్లాకు చెందిన గొల్లపల్లి, జయశంకర్‌ భూపాలపల్లిలోని చిట్యాల, చినపాక గ్రామాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news