రేషన్ కార్డు కోసం అప్లై చేసేవాళ్ళు తప్పక ఈ విషయాలు గమనించాల్సిందే…!

-

మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చెయ్యాలనుకుంటున్నారా..? అప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలని మీరు గుర్తుంచుకోవాలి. ఈ 5 విషయాలు కనుక మీరు గుర్తుంచుకుంటే సులువుగా మీ రేషన్ కార్డుని మీరు పొందవచ్చు. రేషన్ కార్డు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశముంది. కాబట్టి తప్పకుండ రేషన్ కార్డుకు అప్లై చేసుకునే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి.

ముందుగా ఈ డాక్యుమెంట్స్ ని సిద్ధం చేసుకోండి. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాస్‌ పోర్ట్ లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఐడీ కార్డ్, హెల్త్ కార్డ్ వంటివి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లు మీరు ప్రూఫ్ గా అందించొచ్చు. అలానే పాన్ కార్డు, పాస్ ‌పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్‌కమ్ సర్టిఫికెట్, గ్యాస్ కనెక్షన్ బిల్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్ రేషన్ కార్డు అడ్రస్ ప్రూఫ్ ‌గా, ఐడెంటిటీ ప్రూఫ్ ‌గా పని చేస్తుంది. కాబట్టి మొదట వీటిని సిద్ధం చేసుకోండి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే రేషన్ కార్డులలో ప్రస్తుతం 4 రకాల కార్డులు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల మీకు ఏ రేషన్ కార్డు కావాలో దానికే మీరు అప్లై చేసుకోండి. ఇలా దానికి తగ్గ సమాచారాన్ని క్లుప్తంగా తెలుసుకోండి. లేకపోతే ఇబ్బందులు రావొచ్చు. ఇది ఇలా ఉండగా బీపీఎల్, ఏపీఎల్, ఏఏవై, ఏవై కార్డులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మీరు వీటి కోసం ముందే అవసరమైన సమాచారం తెలుసుకోండి. మనకి రేషన్ కార్డు సాయంతో తక్కువ ధరకే రేషన్ సరుకులు వస్తాయి అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవి ఎలా లభిస్తాయి అనే విషయానికి వస్తే.. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) ద్వారా మనకి అందుతాయి. కాబట్టి అవసరమైన సమాచారం తెలుసుకొని పైన చెప్పిన డాక్యుమెంట్స్ ని సిద్ధం చేసుకుంటే ఇలా చేస్తే మీ రేషన్ కార్డు సులువుగా పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version