క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే వారికి ఇకపై భారీ మూల్యం తప్పదు..!

-

క్రెడిట్ కార్డుల వల్ల అనేక లాభాలు ఇంకా ఆఫర్స్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. క్రెడిట్ కార్డు ఉపయోగించటం వల్ల ఆఫర్లు, డిస్కౌంట్లు, ఈఎంఐ, క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ, పే బ్యాక్ పాయింట్లు వంటి అనేక ప్రయోజనాలు మాత్రమే కాకుండా ఇంకో లాభం కూడా ఉంది. మన దగ్గర చేతిలో డబ్బులు లేనప్పుడు క్రెడిట్ కార్డు నుంచి నేరుగా డబ్బులను మన బ్యాంక్‌ అకౌంటుకు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోనే సౌలభ్యం కూడా ఉంది.

మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎం కూడా క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు పేటీఎం సంస్థ వారు కస్టమర్లుకు ఒక్క ఝలక్ ఇచ్చింది. పేటీఎం తాజాగా కొత్త రూల్ ను ప్రవేశపెట్టింది. అదేమిటంటే.. క్రెడిట్ కార్డు నుంచి వాలెట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే ఇకపై చార్జీలు చెల్లించాల్సివస్తుంది. ఇక మీదట క్రెడిట్ కార్డు నుండి పేటీఎం వాలెట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చెయ్యాలంటే 2 శాతం అదనపు చార్జీలు చెల్లించుకోవాలి. అంటే క్రెడిట్ కార్డు నుంచి రూ.100 పేటీఎం వాలెట్‌కు పంపించాలనుకొంటే మన క్రెడిట్ కార్డు నుంచి రూ.102 ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. కానీ పేటీఎం క్రెడిట్ కార్డు నుండి పేటీఎం వాలెట్ కి పంపించుకొంటే 1 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది ఇప్పుడు.

పేటీఎం మొబైల్ వాలెట్‌కు వచ్చిన డబ్బులను తర్వాత మన బ్యాంక్ అకౌంట్‌కు ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా చార్జీలు చెల్లించుకోవాలి. అంటే ఎలా అయినా చార్జీల బాదుడు తప్పదిక. కేవలం పేటీఎం వాలెట్‌ను డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ సాయంతో లోడ్ చేసుకుంటే మాత్రం ఎటువంటి చార్జీలు చెలించాల్సిన పనిలేదు. కాబట్టి ఇక నుంచి ఎవరైనా పేమెంట్ వ్యాలెట్స్ లోకి క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news