భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ తొలి తెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు.ఐదు రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియంలో మొత్తం కారు మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఇప్పటికే పిచ్ ప్రాంతంలో చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో మ్యాచ్ ప్రారంభానికి ఆలస్యం కానుంది. ఈ మ్యాచులో కివీస్ గెలుపునకు 107 పరుగులు చేయాల్సి ఉంది.
భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి. వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే డ్రా అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలాఉండగా, మ్యాచ్ తొలిరోజున కూడా వర్షం కారణంగా ఆట రద్దయిన విషయం తెలిసిందే. రెండో రోజు మ్యాచ్ ప్రారంభం అవ్వగా.. ఇండియా దారుణ ప్రదర్శన చేసింది. ఆ తర్వాత మూడో రోజున టీమిండియా పుంజుకుని కివీస్ విధించిన లక్ష్యాన్ని చేధించడంతో పాటు 107 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌కు విధించింది.