హైదరాబాద్ లో ల్యాండ్ సెటిల్మెంట్ కల్చర్ నెమ్మదిగా మళ్ళీ పురుడు పోసుకుంటోంది. కొన్నాళ్ళగా సైలెంట్ గా ఉన్న ముఠాలు మళ్ళీ యాక్టివ్ అవుతున్నాయి. తాజాగా ఫిలింనగర్‌లో నివసించే సినీ నటుడు జగపతి సోదరుడు యుగేంధ్ర కుమార్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం సంచలనంగా మారింది. యుగేంధ్ర కుమార్‌కు గుట్టల బేగంపేట అనే చోట ఒక స్థలం ఉంది ఆ స్థలం విషయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి దాదాపు 25 ఫోన్ కాల్స్ వచ్చినట్టు చెబుతున్నారు.
యుగేంధ్ర కుమార్‌తో పాటు అతని కుమారుడిని కూడా చంపేస్తామని శ్రీనివాస్ బెదిరించినట్టు చెబుతున్నారు. దీని వెనుక బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన రాజిరెడ్డి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ యుగేంధ్ర కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈయన జగపతిబాబు సొంత సోదరుడు కాదు. దగ్గరి బంధువులు అని మాత్రం తెలుస్తోంది. ఈ విషయం మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది.