ఈ మధ్యే ప్రారంభించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పోలీసులకి తలనొప్పిగా మారింది. నిజానికి ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడమే కాక పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ బ్రిడ్జి నిర్మించారు. పర్యాటకుల తాకిడి ఎక్కువ కావడంతో వీకెండ్స్ రెండు రోజులు పూర్తిగా వాహనాలు నిలిపివేసి సందర్శకులను అనుమతి ఇస్తున్నారు. అయితే ప్రమాదకర రీతిలో ఫోటోలు దిగుతున్న కారణంగా రాత్రి 11 గంటలకి ఈ ఫ్లై ఓవర్ మూసేస్తున్నారు.
అయినా ఆకతాయిలు ఎలాగోలా దూరి వెళ్తున్నారు. రాత్రి సమయంలో విద్యుత్ వెలుగుల మధ్య ఈ కేబుల్ బ్రిడ్జి అందాన్ని వర్ణించ జాలము, అందుకే అప్పుడు ఫోటోలు దిగేందుకు యువత ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై రాత్రి సమయంలో అల్లరి పనులు చేస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఎంత కట్టడి చేసినా పోకిరీలు అరాచకాలు చేస్తున్నారు. బ్రిడ్జీపై ఆగి సెల్ఫీలు దిగితే కేసులు పెడతామని హెచ్చరికలు చేస్తున్నా, పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. ఒకడు అయితే ఏకంగా అర్థరాత్రి బట్టలు విప్పేసి నడిరోడ్డుపై పడుకొని సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ లైవ్ లో సీసీ కెమెరాలకు చిక్కారు. అప్పటికప్పుడు వెళ్ళిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల్స్ కింద కేసు నమోదు చేశారు.