ఏపీ మంత్రి కాకానికి లోన్ యాప్ నిర్వాహకుల బెదిరింపులు

-

లోన్ యాప్ ఆగడాలకు అడ్డుకట్టపడడం లేదు. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి ఈ లోన్ యాప్ లు. తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు సైబర్ క్రైమ్ టెన్షన్ పెడుతుంటే.. దీనికి తోడు లోన్యాకుల వేధింపులు రోజురోజుకి పెచ్చిల్లిపోతున్నాయి. మధ్యతరగతి కుటుంబాలే కాదు ప్రముఖులకు ఈ వేధింపులు తప్పడం లేదు. తాజాగా ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కోల్ మాన్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్ల నుంచి ఫోన్ వచ్చింది.

ఆయన పిఏ శంకర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడగా..”మీరు లోన్ తీసుకున్నారని.. కట్టకపోతే మీ పిల్లలను చంపేస్తామని” బెదిరించారు. దీంతో ఆయన 25 వేలు చెల్లించారు. అక్కడితో ఆగకుండా తిరిగి మళ్ళీ, మళ్ళీ కాల్స్ చేసి వేధిస్తూ ఉండడంతో నేరుగా జిల్లా ఎస్పీ విజయరావుకు ఫిర్యాదు చేశారు శంకర్. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెన్నై వెళ్లి దర్యాప్తు చేశారు. కోల్ మాన్ కంపెనీలో ఆధారాలను సేకరించి మేనేజర్ మామిడిపూడి గురు ప్రసాద్ తో పాటు పలువురిని అరెస్టు చేసి లాప్టాప్, మొబైల్స్ సీజ్ చేశారు.

అయితే నెల్లూరు రామలింగాపురంలోని ఫుల్ ట్రాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 8 లక్షలకు పైగా లోను తీసుకున్న పాతపాటి అశోక్ కుమార్ అనే వ్యక్తి లోన్ తీసుకొని ఆ రుణం తీర్చకపోవడంతో అశోక్ మొబైల్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారిని యాప్ నిర్వాహకులు కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. ఇటువంటి బెదిరింపు కాల్స్ వస్తే బయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version