అదిరే స్కీమ్స్.. రూ.లక్ష పెట్టుబడికి రూ.2లక్షలు..!

-

పోస్టాఫీస్ మన కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకొచ్చింది. పైగా ఎలాంటి రిస్క్ ఉండదు. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ రాబడి కూడా వస్తుంది. అయితే పోస్టాఫీసులో వివిధ రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మూడు బెస్ట్ స్కీమ్స్ వున్నాయి. ఇక వాటి వివరాలలోకి వెళితే..

post offcie
post offcie

 

ఆ పథకాలే కిసాన్ వికాస్ పత్ర, నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికేట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్‌ స్కీమ్. ఈ స్కీమ్స్ ద్వారా చక్కటి ప్రయోజనాలను మనం పొందొచ్చు. కిసాన్ వికాస్ పత్ర లో 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. దీనిలో చేరాలంటే కేవలం రూ.100 చాలు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్. 6.8 శాతం వడ్డీ ఉంటుంది. ఖాతాను తెరవడానికి మీరు కనీసం రూ.1000 చాలు. నెలవారీ ఆదాయ పథకం కి కూడా రూ.1000 చాలు. కిసాన్ వికాస్ పత్ర లో సింగిల్ అకౌంట్, జాయింట్ అకౌంట్లు ఉంటాయి. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు.

అదే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ లో అయితే మనం పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవ్వాలంటే 10.7 సంవత్సరాలు పడుతుంది. అదే నెలవారీ ఆదాయ పథకం అయితే మెచ్యూరిటీ వ్యవధి 5 ​సంవత్సరాలు. వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లిస్తారు. డబ్బు రెట్టింపు కావడానికి 10 సంవత్సరాల 11 నెలల పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news