ఆర్ఆర్ఆర్ అప్డేట్…జననీ వీడియో సాంగ్ విడుదల..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పలు అప్డేట్ లు రాగా తాజాగా మరో అప్డేట్ ను చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమా నుండి జననీ అనే సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను కీరవాణి రాశారు. అంతే కాకుండా ఆయనే స్వరాలు సమకూర్చరు. ఈ పాట దేశభక్తి నేపథ్యంలో ఎంతో ఎమోషనల్ గా సాగుతోంది.

Rrr janani song released
Rrr janani song released

పాటలోని లిరిక్స్ గుండెను హత్తుకునేలా ఉన్నాయి. ఇక ఈ పాట వీడియో చరణ్ తో పాటు ఎన్టీఆర్ అజయ్ దేవ్ గన్ శ్రియా లు కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా చిత్ర యూనిట్ కూడా ప్రమోషనల్ కార్యక్రమాలలో బిజీ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ఫైనల్ కు కూడా ఆర్ ఆర్ ఆర్ టీం వెళ్లనుంది అని టాక్ వినిపిస్తోంది.

https://youtu.be/Yg8xZ7LslkQ