వికారాబాద్‌లో ముగ్గురు సీఐలు, 13మంది ఎస్‌ఐలు సస్పెన్షన్

-

అక్రమాల్లో భాగం కావడం, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు పలువురు పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేశారు.తెలంగాణలో మల్టీజోన్-2లోని 9 జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో విఫలమైన ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్‌ఐలను వీఆర్‌వోలుగా కొనసాగిస్తూ మల్టీజోన్-2 ఐజీపీ వి.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

వీఆర్‌లో ఉంచిన వారిలో సంగారెడ్డి రూరల్, తాండూరు రూరల్, తాండూరు టౌన్ సీఐలతో పాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్), పెన్‌పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్‌ఐలు ఉన్నారు. వీరిలో ఇసుక అక్రమ రవాణాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు ఐజీ వెల్లడించారు.త్వరలో వారిని లూప్‌లైన్‌కు బదిలీ చేయనున్నట్లు చెప్పారు. కాగా, ఇప్పటికే ఒక సీఐ, 14 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. వికారాబాద్ జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణా,అక్రమ పీడీఎస్ బియ్యం రవాణా, మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కీలక కేసుల్లో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కథనాలు రావడంతో ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version