యశోద ఆస్పత్రిలో BRS కార్యకర్తల రచ్చ.. !

-

Riot by BRS activists at Yashoda Hospital in Somajiguda: సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో BRS కార్యకర్తల హంగామా సృష్టించినట్లు వార్తలు వస్తున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది, స్టాఫ్ పై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారట మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు. యశోద హాస్పిటల్ లో యూ ట్యూబర్ చిలుక ప్రవీణ్‌ ను పరామర్శించడానికి వెళ్లారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు, BRS నాయకులు. అయితే… ఆ ఆస్పత్రిలో సెల్ ఫోన్ తో వీడియోస్ తీశారట BRS నాయకులు.

Riot by BRS activists at Yashoda Hospital in Somajiguda

ఈ తరుణంలోనే… వీడియోస్ తియకండి అంటూ అడ్డుకుందట సెక్యూరిటీ సిబ్బంది. వీడియోలుతీస్తే ఏంటీ తప్పా… మీ ఆస్పత్రిలో ఏమైనా.. అక్రమాలు జరుగుతున్నాయా.. అని ప్రశ్నించారట జగదీశ్వర్ రెడ్డి అనుచరులు. ఈ తరుణంలోనే… సెక్యూరిటీ సిబ్బంది, మాజీ మంత్రి అనుచరుల మధ్య గొడవ అయినట్లు సమాచారం. అయితే.. ఇందులో ఏది నిజమో తెలీదు కానీ.. ఇప్పుడు ఈ న్యూస్‌ వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version