ఓం ప్రధాన బీజాక్షరం. ఓంకారాన్ని యోగా, ధ్యానం చేసే వాళ్ళు ఎక్కువగా పఠించడం మనం చూస్తూ ఉంటాం. ఓంకార మంత్రాన్ని జపించడం వలన ఎలాంటి లాభాలను పొందవచ్చు..? మీకు తెలుసా..? చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఓంకారం జపించడం వలన మనసుకు ప్రశాంతత వస్తుంది. చుట్టూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా ఓంకారం జపించడం వలన నిద్రలేమి సమస్య ఉన్నవాళ్లు మంచి నిద్రను పొందవచ్చు. ప్రశాంతంగా, హాయిగా నిద్రపోవచ్చు. అలాగే ఓంకారం జపించడం వలన పొట్ట కండరాలు రిలాక్స్ అవుతాయి. దీంతో కడుపునొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి.
ఓంకారం జపిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రతను పెంచుకోవచ్చు. హైపర్ టెన్షన్ కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే ఓంకారం పఠించడం వలన ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. కోపం, ఆందోళన వంటి సమస్యలు ఉండవు. ఓంకారం జపించడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
గుండె సాధారణంగా కొట్టుకోవడానికి ఈ మంత్రం ఎంతగానో సహాయం చేస్తుంది. సైనస్ సమస్య ఉంటే ఈ మంత్రాన్ని రోజూ పఠిస్తూ ధ్యానం చేయాలి. ఇలా చేయడం వలన స్వరపేటిక ద్వారా వచ్చే కంపధ్వని సైనస్ ని క్లియర్ చేయడానికి అవుతుంది. ఓంకారన్ని జపిస్తే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఇలా అనేక సమస్యల నుంచి ఓంకారం జపించడం వలన బయటపడొచ్చు.