రేణిగుంట సమీపంలోని వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు..!

-

ఇటీవల కురిసిన వర్షలకే రెండు తెలుగు రాష్ట్రాలు అతకులం అయ్యాయి. ఇక తాజాగా నివర్ తుపాన్‌ కారణంగా కొన్ని ప్రాంతాలల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతులున్నాయి. తుపాన్‌ ముప్పును ముందే గ్రహించిన అధికారులు ప్రజలకు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. లోతట్టు ప్రాంతాల వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే తాజాగా మరో ముగ్గురు రైతులు వాగులో చిక్కున్నారు.

farmers
farmers

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మల్లెమడుగు రిజర్వాయర్ నిండిపోవడంతో నీటి ఉధృతి పెరిగి ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. ఏర్పేడు మండలం డిక్షన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొలంలో మోటార్ కోసం వెళ్లి ముగ్గురు రైతులు వాగులో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఇక నివర్‌ తుపాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

అయితే రేణిగుంటఎయిర్ పోర్ట్ సమీపంలో కుమ్మరితోపు చెరువులో చెట్టును పట్టుకుని వేళాడుతున్న ముగ్గురు రైతులు వెంకటేశ్, ప్రసాద్, లోకేష్.. మోటార్ కోసం పొలానికి వెళ్లివస్తూ చిక్కుకుపోయారు. ఒక్కసారిగా వచ్చిన వరదనీటితో కొట్టుకుపోయిన ముగ్గురు చెట్టుకు పట్టుకుని వేలాడుతూ ప్రాణాలను కాపాడుకున్నారు. దీంతో రేణిగుంట డీఎస్పీ, సీఐ సహా ఇతర అధికారులు వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రప్పించి లేదా హెలికాప్టర్ సాయంతో రైతులను బయటకు తీసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మరోవైపు, మల్లెమడుగు రిజర్వాయర్ నిండిపోవడంతో నీటి ఉధృతి పెరిగింది. అయితే, బాధితులను కాపాడటం కష్టతరం కావొచ్చని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు తమ వారిని రక్షించాలంటూ కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news