జగన్ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఏపీలో మరో మూడు మెడికల్‌ కాలేజీలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.. కేంద్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాలేరు లో లో మొత్తం మూడు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంపై రాజ్యసభలో.. వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్.

కేంద్ర ప్రభుత్వ ప్రాదేశిక పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు. పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నం లో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని స్పష్టం చేశారు. వీటి కోసం త్వరలోనే నిధులను విడుదల చేస్తామని కూడా ప్రకటించారు కేంద్ర మంత్రి.