సినిమా టికెట్స్ ధరలపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు.. పరిశ్రమను కాపాడుతాం

విజయవాడ : ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ను దర్శించుకున్నారు హీరో నందమూరి బాలక్రుష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ సందర్భంగా బాలకృష్ణ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దుర్గగుడి అధికారులు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలయ్య. బాలకృష్ణకు అమ్మవారి చిత్రపటంతో పాటు వేద ఆశీర్వచనం అందించారు అర్చకులు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. అఖండ మంచి విజయం సాధించిందని.. మన హిందు ధర్మాన్ని ఈ సినిమా చూపించిందని వెల్లడించారు బాలక్రిష్ణ. అమ్మవారి ఆశీస్సులతో సినిమా ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు బాలక్రిష్ణ. ఆన్లైన్ టికెట్స్ పై హై కోర్ట్ తీర్పు కి సుప్రీమ్ కోర్ట్ కి వెళ్తాము అంటున్నారు…మేం అన్నిటికీ సిద్ధం అయ్యే సినిమా విడుదల చేసామని పేర్కొన్నారు. సినిమా బాగుంటే అందరూ ఆదరిస్తారు.. సినిమా టికెట్స్ పై తన ప్రయత్నం తాను చేసానని చెప్పారు బాలక్రిష్ణ. సినీ ఇండ్రస్ట్రీని కపాడుతామని స్పష్టం చేశారు బాల క్రిష్ణ.