తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో నేడు ప్రధాని మోదీ భేటీ…

దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. 2023 ఎన్నికల వరకు దేశంలో కొత్త ప్రాంతాల్లో బీజేపీని మరింత బలోపేతం చేయాలని ఆలోచిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు ఎప్పటినుంచో అనుకుంటుంది. తెలంగాణ, ఏపీలల్లో వలసలు చేరికల ద్వారా పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అనుకన్నంతగా ఎంపీ సీట్లను గెలవాలని పార్టీ అధినాయత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది.

దీనికి అనుగుణంగానే నేడు ఏపీ, తెలంగాణ ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రధాని నివాసంలో జరిగే అల్పాహార విందుకు ఎంపీలకు ఆహ్వానం అందింది. దీనికి తెలంగాణ, ఏపీ చెందిన లోక్ సభ, రాజ్య సభ ఎంపీలు హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితులు, పార్టీని బలోపేతం చేయాలంటే ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోవాలనే విషయాలను ప్రధాన మోదీతో ఎంపీలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందకు ముందు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కావాల్సి ఉన్నా.. బిపిన్ రావత్ హఠాన్మరణంతో  ఆ భేటీ రద్ధు అయింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ నేతలనే కాకుండా కర్ణాటక బీజేపీ ఎంపీలు కూడా ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.