ఏపీలో అభివృద్ధి ఊపందుకుంది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో రాష్ట్ర ప్రగతిలో కీలకమయ్యే ప్రాజెక్టులు వేగవంతంగా మంజూరు అవుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు కూడా వివిధ శాఖలపై సమీక్షిస్తూ..నిధులు, ప్రాజెక్టుల కోసం ఢిల్లీ పర్యటనలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పం,శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. దీని ద్వారా కనెక్టివిటీని పెంపొందించడమే కాకుండా ఆర్థిక పురోగతిని కూడా ప్రోత్సహించవచ్చని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.