కరోనా బాధితుల్లో కొత్తగా 3 లక్షణాలు

-

కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రరూపం దాలుస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను విధిస్తున్నా ఫలితాలు ఇవ్వడం లేదు. అయితే ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 1 కోటి దాటింది. మరోవైపు కరోనా కారణంగా 5,01,480కి పైగా మృతి చెందారు. ఇక రోజు రోజుకీ కరోనా బాధితుల సంఖ్య భారీ పెరుగుతూనే ఉంది. అయితే కరోనా ఉన్నట్లు తెలిపే లక్షణాల గురించి ఇప్పటికే మనకు తెలిసిన విషయం విదితమే. కాగా ఈ జాబితాలో మరో 3 కొత్త లక్షణాలు వచ్చి చేరాయి.

ఇప్పటి వరకు కరోనా వచ్చిన వారిలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపించిన విషయం విదితమే. అయితే మరో మూడు కొత్త లక్షణాలు ఈ జాబితాలో చేరాయి. కరోనా వచ్చిన వారిలో వికారం లేదా వాంతులు, డయేరియా (విరేచనాలు), ముక్కు కారడం వంటి మూడు లక్షణాలు కూడా ఉంటాయని తేల్చారు. అలాగే గొంతులో మంట, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలను ఇదివరకే గుర్తించారు. అయితే ఈ లక్షణాలన్నీ వైరస్‌ సోకిన 2 నుంచి 14 రోజుల వరకు కనిపిస్తాయి.

కరోనా వైరస్‌ ఉందని తెలిపే లక్షణాలు…

జ్వరం, వణుకు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, రుచి చూడలేకపోవడం, వాసన పసిగట్టలేకపోవడం, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, వాంతులు, డయేరియా తదితర లక్షణాలు కరోనా ఉన్నవారిలో కనిపిస్తాయి. ఈ లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరిలో అయినా ఇవి కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version