
నోరెళ్లబెట్టకండి. పైన ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలాంటి వింత పోకడలు, కొత్త కొత్త కట్టడాలు ఎక్కడుంటాయి. మీరు గెస్ చేసింది కరెక్టే. చైనాలో. నార్త్ వెస్ట్ చైనాలో ఓ హైవే బ్రిడ్జిని ఇలా కట్టారు. మూడు ఫ్లోర్లు ఉన్న ఈ హైవే బ్రిడ్జి ప్రస్తుతం అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అక్కడ ఇలా మూడు ఫ్లోర్ల బ్రిడ్జిని ఎందుకు కట్టారో తెలియదు కానీ.. నెటిజన్లకు మాత్రం ఈ బ్రిడ్జి సూపర్ గా నచ్చేసింది. అందుకే ఆ బ్రిడ్జికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


