కాళ్లరిగేలా తిరుగుతున్న  రాష్ట్ర ప్రభుత్వం ?? కనికరించేది ఎవరు ?

-

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎన్నో సంవత్సరాల నుండి కలలు కన్నా సీఎం పదవిని సంపాదించిన వైయస్ జగన్ కి కరోనా వైరస్ ఎదుర్కోవటం పెనుసవాలుగా మారింది. ఇదే తరుణంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం కోసం జగన్ నానా తిప్పలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైనా లోన్ ఇస్తారేమో అని కాళ్లరిగేలా జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏపీ రాజకీయాల వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్ వచ్చినా గానీ కొన్ని సంక్షేమ కార్యక్రమాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి ఏర్పడినట్లు వార్తలు వినపడుతున్నాయి.Jagan's budget propose to finish Polavaram by 2021 | Deccan Heraldచంద్రబాబు హయాంలో భయంకరమైన అప్పుల ఊబిలో రాష్ట్ర ఉండటంతో పాటుగా ఖాళీ ఖజానా ఉంచి వెళ్లడంతో ప్రస్తుతం వైఎస్ జగన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకపక్క కరోనా కష్టాలను ఎదుర్కొంటున్న వైయస్ జగన్ సర్కార్ రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారంలో మరియు అదే విధంగా పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇదే తరుణంలో కేంద్ర ప్రభుత్వాన్ని 6 వేల కోట్ల అప్పు ఏపీ సర్కార్ అడిగిందట.

 

అయితే దీనిపై కేంద్రం మాత్రం అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. తమ వద్ద నిధులు లేవని, ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే మాత్రం ఇబ్బందులు వస్తాయని ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఇటువంటి టైం లో వైఎస్ జగన్ సర్కార్ నీ కనికరించింది కనికరించేది ఎవరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. 

Read more RELATED
Recommended to you

Latest news