తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.అయితే, కొన్ని చోట్ల అధికారులు, టీచర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి పరీక్షల టైంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు టీచర్లపై సస్పెన్షన్ వేటు పడింది.
ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీం, ఇన్విజిలేటర్ దీపికను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పరీక్ష సమయంలో టెన్త్ పరీక్షా కేంద్రం నుండి కొన్ని ప్రశ్నలు బయటకు లీక్ అయ్యాయని, ఆ ప్రశ్నలను కాగితంపై రాసి పంపారని సదరు ఉపాద్యాయులపై ఆరోపణలు వచ్చాయి. నిన్నటి ఈ విషయంపై ఆరా తీసిన అధికారులు.. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.