కరోనా వైరస్ మూడు రకాలు… అవి ఏంటీ…?

-

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా అది మాత్రం కట్టడి అయ్యే పరిస్థితి లేదు. రోజు రోజుకి కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. లక్ష దాటిన మృతులు, 16 లక్షలు దాటిన కేసులు అన్నీ కూడా ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. దీనికి మందు కనుక్కోవడానికి ఎన్నో విధాలుగా ప్రపంచ దేశాలు కష్టపడుతున్నాయి.

బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 2019లో తొలి కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు కొవిడ్‌-19లో ఏ విధంగా మార్పులు వచ్చాయి అనే దాని మీద పరిశోధనలు చేసారు. దాదాపు అన్ని దేశాల్లో డిసెంబరు 24 నుంచి మార్చి 4 వరకు 160 మంది నుంచి శాంపిల్స్ ని పరిశోధకులు సేకరించారు. రెండు నెలల తేడాలో కరోనా వైరస్ లో మూడు మార్పులు వచ్చాయని గుర్తించారు.

A, B, C అనే మార్పులు వచ్చాయని గుర్తించారు. అంటే మూడు రకాలుగా అది మారింది అని చెప్పారు.

A రకం కరోనా; చైనాలో వచ్చినా సరే అది ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. వుహాన్‌లో A రకం వైరస్ పెద్దగా లేదు. ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది.

B రకం కరోనా; వైరస్ చైనాతోపాటు మంగోలియా, ఉత్తర కొరియా, దక్షిణకొరియా, జపాన్‌, హాంకాంగ్‌ దేశాలకు పాకింది.

C రకం కరోనా వైరస్‌… ఇటలీ, స్వీడన్, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ దేశాల్లో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version