ఆన్లైన్ డేటింగ్ యాప్ కి భారీగా డిమాండ్…!

-

లాక్ డౌన్ లో చాలా మంది ఖాళీ గా ఉండి ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నారు. లాక్ డౌన్ ని పొడిగించే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ లో ఎక్కువగా సందడి చేస్తున్నారు. ఈ తరుణంలో డేటింగ్ యాప్ క్వాక్ క్వాక్ లో వినియోగదారుల సంఖ్య బాగా పెరిగిందని తాజా లెక్కలు చెప్తున్నాయి. లాక్‌డౌన్‌ ప్రకటన విడుదలైన నాటి నుంచి కూడా ఈ యాప్ లో ప్రతీ రోజు…

18,000 మంది కొత్త వినియోగదారులు చేరుతున్నారని తెలుస్తుంది. 80 లక్షలకు పైగా యాక్టివ్‌ వినియోగదారులు ఈ యాప్ లో ఉన్నారు. దీనిపై ఈ యాప్ శుక్రవారం లెక్కలను విడుదల చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. చాట్‌లు కూడా రోజుకు 3,50,000 నుంచి 5,00,000కు చేరాయని సంస్థ పేర్కొంది. ఇక ఎవరు ఎక్కువగా చేరుతున్నారు అనే దానిని కూడా యాప్ తన లెక్కల్లో పేర్కొంది.

విక్రయాలు-మార్కెటింగ్‌ వ్యక్తులు(50% పైగా); వ్యాపారులు(25% పైగా), విద్యార్థులు(25%పైగా) ఎక్కువగా చేరుతున్నారని వివరించింది. కొత్త వినియోగదారులు రోజుకు 80% పైగా పెరుగుతూ ఉన్నారని చెప్పుకొచ్చింది. దీనితో తమ ఆదాయాలు 20 శాతం మేర పెరుగుతున్నాయని సంస్థ యజమాని రవి మిట్టల్ వివరించారు. యువతతో పాటుగా పెళ్లి అయిన వాళ్ళు ఈ యాప్ లో ఎక్కువగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version