తెలంగాణాలో పులి కలకలం.. మహారాష్ట్ర నుండే ?

-

కొమురం భీం జిల్లా దహేగాం మండలం దిగడ గ్రామంలో పులి పంజా విసిరింది. గ్రామానికి చెందిన యువకుడిపై పులి దాడి చేయడంతో యువకుడు మృతి చెందాడు. ఆటవీప్రాంతంలో పశువుల కాపరి విఘ్నేష్ పై పులి దాడి చేయడంతో ఆ యువకుడి మృతి చెందారు. అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి బయలుదేరారు. ఈరోజు అడవుల్లో కనిపించిన ఈ పులి మహారాష్ట్రకు చెందిన మ్యాన్ ఈటర్ అని భావిస్తున్నారు. నిజానికి మహారాష్ట్రలో మూడు నెలలుగా ఈ పులులు టెన్షన్ పడుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ఎనిమిది మందిని పులులు చంపేసినట్టు చెబుతున్నారు.

ఒక చంద్రపూర్ జిల్లా రాజురా తాలూకా లోనే 10 మంది పై దాడి చేసినట్లు చెబుతున్నారు. అయితే అక్కడ ఉన్న ఒక పులిని మహారాష్ట్ర అధికారులు పట్టుకున్నారు. కానీ మరో పులి మాత్రం పట్టుకోలేకపోయారు, ఆ పులి తప్పించుకుంది. అక్కడ తప్పించుకున్న పులి దహెగాంలో ప్రత్యక్షమై నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. పులి దాడి చేయడంతో భయాందోళనలో గ్రామస్తులు ఉన్నారు. ఈ పెద్ద పులి కోసం ఇప్పుడు ఫారెస్ట్ సిబ్బంది అలాగే పోలీస్ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రైతులు పశువుల కాపర్లు సామాన్య జనాలు ఎవరు అడవుల్లోకి వెళ్ళి దాని ఆదేశాలు జారీ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news