మొబిక్విక్ శుభవార్త.. షాపింగ్ కు లక్ష రూపాయిల రుణం

-

మీ అందరికి మొబిక్విక్ యాప్ తెలుసా? మీరు కూడా ఆ యాప్ ఉపయోగిస్తుంటారా. అయితే ఈ వార్త మీకే. మొబిక్విక్ ద్వారా సులభంగానే రూ.లక్ష వరకు రుణం పొందే ఛాన్స్ ఉంది. ప్రిపెయిడ్ కార్డుపై రూ.లక్ష వరకు లిమిట్ లభిస్తోంది. అదేలా అనుకుంటే పూర్తి కథనం చదివేయండి.

money
money

అసలే పండుగ సీజన్. చాలా మంది ఇప్పుడు షాపింగ్ చేస్తుంటారు. హోమ్ అప్లైయాన్స్స్, సామాగ్రి, బట్టలు ఇలా ఎన్నో కోంటుంటాం. కానీ, కొనే సమయం వచ్చేసరికి చేతిలో డబ్బులు లేకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఇలాంటి వారికి తీపికబురు. ప్రముఖ వాలెట్ సంస్థ మొబిక్విక్ తాజాగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో జతకట్టింది. ఇందులో భాగంగా కొత్తగా తొలిసారిగా వర్చువల్ ప్రిపెయిడ్ పేమెంట్స్ కార్డను తీసుకువచ్చింది. ఇది క్రెడిట్ కార్డులా పని చేస్తుందని సంస్థ తెలిపింది. తమ సంస్థ సర్వీస్ విస్తరణలో భాగమే ఈ ప్రిపెయిడ్ కార్డు అని పేర్కొన్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థగా మారడానికి ఈ మొబిక్విక్ బ్లూ కార్డు ఒక మైలు రాయి అని మొబిక్విక్ కో ఫౌండర్ ఉపాసన టకు తెలిపారు.

మొబిక్విక్ బ్లూ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డు యూజర్ వాలెట్‌తో లింక్ అయ్యి ఉంటుంది. కస్టమర్లకు రూ. లక్ష వరకు ఇన్‌స్టంట్ క్రెడిట్ లభిస్తుంది. మీరు కూడా ప్రిపెయిడ్ కార్డు పొందాలనుకుంటే మొబిక్విక్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని మొబైల్ నెంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. హోమ్ స్క్రీన్‌లో పైభాగంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ లోగో కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి కార్డు యాక్టివేట్ చేసుకోవాలి. వెంటనే మొబిక్విక్ కార్డు జారీ అవుతుంది. ఇంకా ఈ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై కూడా కస్టమర్లకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కొనుగోళ్లపై 1 శాతం సూపర్‌క్యాష్ పొందొచ్చు. దీపావళి షాపింగ్‌ పై 20 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news