టిక్ టాక్ తో ఓ రాష్ట్రాన్ని ఊపేసిన స్టార్ సెక్స్ రాకెట్ హైటెక్ వ్యభిచారం కేసులో చిక్కుకుంది. సన్ స్పా సంస్థ పేరుతో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నాకేసులో టిక్ టాక్ స్టార్స్ సూర్యతో పాటు ఏకంగా 20 మంది అరెస్టు కావడం కలకలం రేపింది. తమిళనాడులోని తిరుచ్చి కి చెందిన టిక్ టాక్ స్టార్ సూర్య ఆంధ్ర ప్రజలకు చాలా సుపరిచితురాలు. టిక్ టాక్ వీడియోలతో ఎవరూ ఊహించని విధంగా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది.
తిరుచ్చి మున్సిపల్ కమిషనర్ లోకనాథన్ ఫిర్యాదు మేరకు తిరుచ్చి పోలీసులు ఊహించని విధంగా దాడి చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మంది అమ్మాయిలు, ఆంటీలు స్పా నిర్వహిస్తున్నారని వెలుగుచూడటంతో అందర్నీ అరెస్టు చేశారు. స్పా ముసుగులో హైటెక్ వేశ్య వాటిక నిర్వహిస్తున్నారని వెలుగుచూడటంతో అందరినీ అరెస్టు చేశారు. మసాజ్ సెంటర్ యజమాని టిక్ టాక్ స్టార్ సూర్య అని పోలీసుల విచారణలో తేలింది, మొత్తం ఇప్పటివరకు 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. టిక్ టాక్ స్టార్ సూర్య కూడా హైటెక్ వ్యభిచారం చేస్తుందని ఆమె ఈ స్పా సెంటర్ యజమాని అని పోలీసులు అంటున్నారు. అయితే ఈ వ్యభిచార కేంద్రానికి తనకు ఎలాంటి సంబంధం లేదని టిక్ టాక్ స్టార్స్ వాదిస్తోంది. పోలీసులు మాత్రం కేసు విచారణలో ఉందని చెబుతున్నారు. మొత్తం మీద సన్ స్పా నిర్వహిస్తూ టిక్ టాక్ స్టార్ పట్టుబడడం హాట్ టాపిక్ అయింది.