త్వరలో టిక్‌టాక్ స్మార్ట్‌ఫోన్.. ఫీచ‌ర్లు మామూలుగా లేవుగా..!

-

టిక్‌టాక్ క్రియేటర్ బైట్‌డ్యాన్స్ త్వరలో విడుదల చేయనున్న స్మార్ట్‌ఫోన్‌కు స్మార్టిజ‌న్ జియాంగో ప్రొ 3 అని నామకరణం చేసింది. ఈ ఫోన్‌లో 6.39 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.

ప్రముఖ సోషల్ యాప్ టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ త్వరలో ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్ యాప్‌కు యూజర్ల నుంచి ఎంతటి ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తన వినియోగదారుల కోసం ఆ సంస్థ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఇక ఆ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.

టిక్‌టాక్ క్రియేటర్ బైట్‌డ్యాన్స్ త్వరలో విడుదల చేయనున్న స్మార్ట్‌ఫోన్‌కు స్మార్టిజ‌న్ జియాంగో ప్రొ 3 అని నామకరణం చేసింది. ఈ ఫోన్‌లో 6.39 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 8/12జీబీ ర్యామ్‌లను అమర్చారు. ఈ ఫోన్ 128, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లభ్యం కానుంది. ఇందులో డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 ఫీచర్లను అందిస్తున్నారు.

ఇక ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 48, 13, 8, 5 మెగాపిక్సల్ కెమెరాలు నాలుగింటిని అమర్చగా ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.29,125 గా ఉండనుంది. అలాగే 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.32,140 ధరకు, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.36,160 ధరకు లభ్యం కానున్నాయి. చైనాలో ఇప్పటికే ఈ ఫోన్‌ను విక్రయిస్తుండగా త్వరలోనే భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version