చిన్నతనం నుండే సంగీతంలో సాధన చేసిన హేమచంద్ర ఓ పక్క చదువుతూనే మరోవైపు పాటల పూదోటలో రాణించాడు. మంచి గాయకుడిగా ఎదిగి ఎందరో యువ గాయకుల్లో స్ఫూర్తిని నింపాడు. హేమచంద్ర కేవలం గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా రాణిస్తున్నాడు. ఇక ఈయన స్వరం ఎంత శ్రావ్యమైనదో మనందరికీ తెలుసు. దాదాపు ఆయన పాడిన పాటలన్నీ ఎక్స్‌ట్రార్డినరీగా నిలిచాయంటే అతిశయోక్తికాదు. అయితే ఈ సారి అతను యూఎస్ఏ లోని యువ చిత్రనిర్మాతలతో జతకట్టాడు.
ఉత్కంఠభరితమైన విజువల్స్ తో ఒక మధురమైన పాటతో అందరి ముందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే ఆదాన్ మ్యూజిక్ సమర్పించిన `ప్రేయసి` పాటను సూరజ్ కంపోజీషన్‌లో పాడి అందరి మనసులను మరో సారి ఆకట్టుకున్నారు. వాస్తవానికి ఈ పాట కోసం చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు. ఇక వారి నిరీక్షణకు తెర పడుతూ ఈ పాటను అక్టోబర్ 29న విడుదల చేశారు. దీంతో ఆ పాటకు చాలా మంది ఫిదా అయిపోయి రకరకాల కామెంట్లు పెడుతున్నారు.