బర్డ్ ఫ్లూ: ఈ టిప్స్ తీసుకుంటే ఇది మీ దరి చేరదు…!

-

ఇప్పుడు బర్డ్ ఫ్లూ చర్చగా మారింది. ఒకటి కాదు రెండు కాదు భారత దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. నిజంగా ఇది అందర్నీ భయపెట్టేస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పక్షుల శవాలు గుట్టల్లా పేరుకు పోయాయి. పెద్ద ఎత్తున పక్షులు మరణించడం ఘోరం అనే అనాలి. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే భోపాల్‌ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ బర్డ్ ఫ్లూ మేరకు కీలక పరీక్షలని నిర్వహించడం కూడా జరిగింది. అయితే మరి నిజంగా బర్డ్ ఫ్లూ ఎందుకు వస్తుంది..?, దీని లక్షణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వంటి పలు విషయాలు మీకోసం.

ఈ బర్డ్ ఫ్లూ రావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… H5N1 వైరస్ వల్ల ఇది వ్యాపిస్తుంది అని తెలియజేయడం జరిగింది. అలానే ఇది మనిషికి సోకితే ప్రాణాంతకం అవ్వవచ్చు. ఇది ఎందుకు వస్తుంది…? ఈ విషయం లోకి వస్తే… సరిగ్గా ఉడకకుండా తీసుకున్న గుడ్లు మాంసం వల్ల ఇది సోకవచ్చు అని నిపుణులు అంటున్నారు. అయితే గుడ్లు తినేవారు గుడ్డులోని పచ్చసోనా గట్టిపడే వరకు ఉడికించాలి అన్నారు. అలానే మాంసాన్ని 165F (74 C) ఉష్ణోగ్రత లో ఉడికించాలి అని చెప్పారు నిపుణులు.

దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, కండరాల్లో వాపు, తలనొప్పి, ఊపిరి తీసుకోవడంలో సమస్య, కళ్లు తిరగడం, విరోచనాలు వంటి లక్షణాల ఉండొచ్చు అని అన్నారు. కొన్ని సందర్భాల్లో కంటి ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. పెంపుడు పక్షల మాంసాన్ని ఆహారంగా తీసుకోకండి. ఓపెన్ మార్కెట్, చిన్న దుకాణాల నుంచి మాంసం కొనుగోలు చేయకండి అని సూచించారు. నిమోనియా, కంజూక్టివిటీస్, ఉపిరితిత్తుల్లో సమస్య ఇలా పలు సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించారు. ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఉండడానికి తరచూ చేతులు శుభ్రం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version