ఎండ వల్ల పెరుగుతున్న స్ట్రెస్‌.. ఈ చిట్కాలతో చెక్‌!

-

ఒకవైపు కరోనా వైరస్, మరో వైపు బీభత్సమైన ఎండలు. వీటి మధ్య మనం జీవనం సాగిస్తున్నం ప్రస్తుతం. అయితే కరోనా మహమ్మారి కోసం పాటించాల్సిన విధానాలను మనం ఇప్పటికే పాటిస్తున్నం. కానీ, ఇప్పుడు మరింత అప్రమత్తం అవ్వాల్సిన తరుణం కూడా. అయితే ఇప్పుడు మనం మరో చిట్కా గురించి కూడా తెలుసుకుందాం. అదే ఎండల వల్ల కలిగే స్ట్రెస్‌ . ఇది కూడా చాలా ప్రమాదకరమైంది. దీని వల్ల రానురాను తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మొదట్లోనే జాగ్రత్తలు పాటిస్తే మేలు.


సాధారణంగా ఎండాకాలం గాలిలో ఆక్సిజన్‌ పరిమాణం బాగా తగ్గిపోయి… కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఎక్కువవుతుంది. దీనివల్ల మనం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజన్‌ మన బ్రెయిన్‌కి సరిపోదు. మెదడులో కణాలు వేడెక్కుతాయి. ఫలితంగా తలనొప్పి మొదలవుతుంది. అది హీట్‌ స్ట్రెస్‌గా మారుతుంది. మొదట్లో అప్పుడప్పుడూ వచ్చే దీన్ని వెంటనే తగ్గించుకోకపోతే… ఇక రెగ్యులర్‌గా వచ్చేస్తూ… తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది.

వాతావరణం 35 డిగ్రీలు దాటితేనే మనం తట్టుకోలేం. పైకి తట్టుకున్నట్లు కనిపిస్తారు కానీ లోపల చాలా అనర్థాలు జరిగిపోతూ ఉంటాయి. ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరగానే మన శరీరం దాన్ని తట్టుకోవాలని ప్రయత్నిస్తూ చెమటను విడుదల చేస్తుంది. దాని వల్ల శరీర చర్మం చల్లగా మారుతుంది. కానీ, శరీరంలో ఉండే నీరు బయటకు వచ్చేయడంతో… డీ–హైడ్రేషన్‌ సమస్య వస్తుంది. నీటి పరిమా«ణం శరీరంలో తగ్గిపోవడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • ఎండా కాలం దృష్ట్యా ఉదయం 11 గంటల తర్వాత, సాయంత్రం 4 గంటల మధ్య ఇంట్లోంచి లేదా ఆఫీస్‌లో నుంచి బయటకు రాకూడదు. ఈ సమయం చాలా ప్రమాదకరం హీట్‌ స్ట్రెస్‌ పెరిగేది ఈ సమయంలోనే. ఒక వేళ తప్పనిసరి అయితే క్యాప్‌ లేదా గొడుగు వాడాలి.
  • హీట్‌ స్ట్రెస్‌ వచ్చినపుడు తల బరువుగా మారుతుంది. మందులు వాడేకంటే, కాస్త నిద్ర పోవడం మేలు.
  • ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి. తలనొప్పి తగ్గుతేనే మనం రిలాక్స్‌ అవుతాం. అందుకే ముఖ్యంగా తలనొప్పి రాకుండా చూసుకోవాలి.
  • ఎండనే కాదు గాలి లేని ప్రదేశంలో సైతం కార్బన్‌ డై ఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కూడా స్ట్రెస్‌ పెరుగుతుంది.
  • ఎక్కువ శాతం నీరు తాగాలి.
  • జనం ఎక్కువగా ఉన్న చోటికి వెళ్లకూడదు. పార్టీలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మొక్కలు, చెట్లు ఉన్న చోట ఎక్కువగా తిరగాలి. తద్వారా మంచి ఆక్సిజన్‌ లభించి… మెదడులో కణాలు చురుకుగా మారతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version