ఇప్పుడు చలి చాలా ఎక్కువగా ఉంది. ఇది చలికాలం కావడం తో కొన్ని ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువుగా ఉన్నాయి. చెప్పాలంటే మరీ ముఖ్యంగా మన ఉత్తర భారత దేశం లో చలి చంపేస్తోంది. అనేక చోట్ల ఉష్ణోగ్రతలు సున్నా దగ్గరికి చేరుకున్నాయి. అంతే కాదండి మరి కొన్ని ప్రాంతాల లో అయితే ఏకంగా మంచు కూడా కురుస్తోంది. మంచు లో ఉండడం మామూలు విషయమా…?
అక్కడికి వెళితే తెలుస్తుంది అంత సులభం కాదని. అయితే మరి ఇలాంటి సమయం లో మీరు షిమ్లా, మనాలీ, ముస్సోరి వంటి హిల్ స్టేషన్స్‌కు వెళ్లాలి అని ప్లాన్ చేస్తోంటే మాత్రం ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..? హిమపాతం అనేక ఆపదలకు, ఇబ్బందులకు కారణం అవ్వవచ్చు కనుక పూర్తిగా జాగ్రత్తలని తీసుకోండి.
tr1. అక్కడకి వెళ్లే ముందే మీరు అక్కడ ఎంతో ఉష్ణోగ్రతలు ఉన్నాయో చెక్ చేయండి. ఇది మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు మనాలి , షిమ్లా, ముస్సోరీ లో మంచు పడుతోంది. కాస్త గమనించండి.
2. సాధారణ దుస్తుల్ని కాకుండా స్నో డ్రెస్, షూస్, కోట్స్ వగైరా వాటిని తీసుకెళ్లండి. చలికి తట్టుకునే దుస్తుల్ని ప్యాక్ చేసుకోండి లేదంటే అక్కడ ఉండడం కష్టం అవుతుంది. తరచూ మంచు ప్రదేశాల్లో వెళ్తుంటే మీరు స్నో షూస్ కొనుక్కోవాలి. లేదా అక్కడే అద్దెకు కూడా తీసుకోవచ్చు.
3. కారు వివరాలని గుర్తుంచుకోండి. కొండల మధ్యకు వెళ్తే ఫోన్ నెట్వర్క్ ఉంటుందో లేదో. అందుకే మీరు పికప్ పాయింట్స్, కారు నెంబర్ ఇలా అన్నీ నోట్ చేసుకోండి. లేకుంటే టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది.