కరోనా వైరస్ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న పలు దేవాలయాలను మూసి వేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ దేవాలయాలను అధికారులు మూసి వేసారు. ఆ జాబితాలో తిరుమల శ్రీవారి ఆలయం కూడా చేరింది. నిన్న సాయంత్రం నుంచి ఆలయాన్ని మూసి వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ముందు సమీక్ష నిర్వహించిన టీడీపీ పాలక మండలి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంది.
దీనితో 128 ఏళ్ళ తర్వాత ఆలయం మూసి వేసారు. అందుబాటులో వున్న ఆధారాల ప్రకారం చివరి సారిగా 128 ఏళ్ల కిందట 1892లో అప్పటి హథీరాంజీ మఠం మహంతుకు, ఆలయ జియ్యంగార్లకు నడుమ తలెత్తిన ఆధిపత్య వివాదంతో రెండు రోజుల పాటు ఆలయం మూసి వేసారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన 110 మంది భక్తుల బృందంలో ఒకరికి కరోనా లక్షణాలు కనిపించడంతో టీటీడీ అప్రమత్తమయింది.
సీసీటీవీ లో చూసి ఆ భక్తుడి కదలికలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అనే దాని మీద ఆరా తీసే ప్రయత్నం చేసారు. అతని పక్కన ఉన్న భక్తులను కూడా అలెర్ట్ చెయ్యాలని చూసారు. అయితే పరీక్షల్లో అతనికి కరోనా లేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజుల పాటు శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశం లేనట్టే. ఏకాంత సేవలు మాత్రం కొనసాగుతాయి.