తిరుపతి లడ్డూ వ్యవహారం పై దర్యాప్తు జరగాలి : కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి

-

తిరుపతి శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు, శ్రీవారి భక్తులు ఈ ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడటం వల్ల తాజాగా కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్లహ్లాద్ జోషి సీరియస్ అయ్యారు. ఈ ఘటన పై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబుతో చెప్పిన వాస్తవాలు తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చెప్పిన వాస్తవాలు తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని.. లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టుగా NDDB నిర్తారించిందని తెలిపారు. లడ్డూలో బీఫ్ కొవ్వు, చేప నూనె వాడిన విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారం పై ఎంక్వైరీ జరిపించి బాద్యులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు వస్తారని.. వారందరి మనోభావాలను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news