నీట్ కౌన్సెలింగ్‌లో స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. వైద్య విద్యలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్థానిక కోటా విషయంలో ఒక్కసారికి మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ప్రభుత్వ స్టేట్‌మెంట్‌ను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు… వైద్య విద్యలో స్థానికత అంశంపై కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
స్థానికత విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇయ్యింది, ప్రతివాదులకు నోటీసులు జారీ, మూడు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి వాయిదా వరకు తెలంగాణ హైకోర్టు తీర్పుపై ‘స్టే’ కొనసాగింపు ఉంటుంది.