మీ పిల్లలు 18 ఏళ్లకే కోటీశ్వరులు అవ్వాలా? అయితే ఈ చిట్కా పాటించండి!

-

సాధరణంగా మనం సెటిల్‌ అయితేనే మన పిల్లలకు కూడా బంగారు బాట ఉంటుందని పరితపిస్తాం. దీనికి అనేక కష్టాను సైతం లెక్క చేయం. అయితే దీనికి అనేక దారులు ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ సమయంలోనే కోటీశ్వరులు కావాలంటే సిప్‌లలో మదుపు చేసుకోవాలని చెబుతారు. ఒక క్రమంలో పిల్లలపై పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి.


ఆ విధానం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని వల్ల మీ పిల్లలు చదువు పూర్తయ్యే నాటికి వారు కోటీశ్వరులు అవుతారు. దీనికోసం మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడికి మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఈ మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా కేవలం మీ పేరు మీద మాత్రమే కాదు మీ పిల్లల పేరు మీద కూడా పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లల తల్లిదండ్రులు చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో సరిగ్గా పెట్టుబడి పెడితే, పిల్లలు 18 ఏళ్లు వచ్చే సరికి ఎక్కువ మొత్తంలో ఆర్థిక నిధిని సృష్టించవచ్చు. దాంతో అతడి ఉన్నత విద్య, లేదా విదేశీ విద్యకు కూడా ఉపయోగ పడుతుంది.

పెట్టుబడి పెట్టే విధానం

ఆర్థిక ప్రణాళికలో భాగంగా మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులు పిల్లల కోసం ఒకే పేరుతో ప్రారంభించవచ్చు. అటువంటి పెట్టుబడిలో తల్లిదండ్రుల పేరు అవసరం. పిల్లల పేరిట మ్యూచువల్‌ ఫండ్‌ పొందాలంటే పిల్లల పుట్టిన ధ్రువీకరణ పత్రం అవసరం. ఒకవేళ మీ పిల్లలకు పాస్‌పోర్ట్‌ ఉంటే అది కూడా చెల్లుతుంది. దీనితో పాటు, అతని తండ్రి పత్రాలు అవసరం.

  • మ్యూచువల్‌ ఫండ్లలో ఎక్కువ శాతం సిప్‌ పద్ధతిలోనే పట్టడం ఉత్తమ మార్గం. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లానింగ్‌లో పెట్టబడులు పట్టడం ద్వారా పిల్లల భవిష్యత్తుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇందు మీ పిల్లల వయస్సు 18 ఏళ్లు దాటితే పెట్టుబడి పెట్టలేం.
  • ఒకవేళ మీ పిల్లలు లక్షాదికారి అవ్వాలనుకుంటే మీ బిడ్డ పుట్టిన వెంటనే రూ. 5 వేలు పెట్టడం ప్రారంభించాలి.
  • ప్రతి ఏడాది పెట్టుబడిని 15 శాతం పెంచాలి. దీనిపై ఏడాదికి మీకు 12 శాతం రాబడి లభిస్తే, 18 ఏళ్ల పిల్లవాడు కోటీశ్వరుడు అవుతాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version