బెండకాయ మొక్క పెంచే విధానం ఇదీ!

-

మీ ఇంటి పెరటిలో బెండకాయ మొక్కను కూడా భాగం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్‌ బై స్టెప్‌ విధానాన్ని ఇలా తెలుసుకోండి. సాధారణంగా బెండకాయ మొక్కలు చాలా త్వరగా పెరుగుతాయి. ఈ మొక్కలు చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా ఎక్కువ కాయలు కూడా కాస్తాయి.
ఆ విధానం ఏంటో తెలుసుకోండి..

ఏడాది మొత్తం లభించే బెండకాయ బయట దొరికే మార్కెట్లో పురుగు మందు ఎక్కువగా చల్లుతారు. అదే ఇంట్లో పండించుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.దీనికి ఎక్కువ స్థలం కూడా అవసరం ఉండదు, మరి కుండిలోనే బెండకాయను ఎలా సాగుచేయాలో తెలుసుకుందాం.

  • మీరు ఏ మొక్కను పెంచాలన్నా విత్తనాల నాణ్యతను పరిశీలించండి.
  • పెద్ద కుండీ తీసుకోండి. ఎక్కువ శాతం ఎండ పడని చోట ఆ కుండీని పెట్టండి. అటువంటి చోటనే బెండకాయ మొక్క బాగా పెరుగుతుంది.
  • విత్తనాలను ఆన్‌లైన్లో లేదా విత్తనాలను విక్రయించే దుకాణంలో కొనాలి. అప్పుడే విత్తనం ఏపుగా పెరుగుతుంది.
  • విత్తనాలను మట్టిలో మూడు అంగుళాల లోతున పెట్టాలి.
  • మొదట కుండీలో మట్టిపోసీ కాసేపు ఎండలో పెట్టాలి. అప్పుడు మట్టిలోని తడిని ఎండ లాగేస్తుంది. మొక్క బలంగా పెరగాలంటే ఈ ప్రక్రియ చాలా ముఖ్యం.
  • విత్తనాలను కుండీ మధ్య భాగంలో మూడు అంగుళాల లోతులో కాస్త గట్టిగా నొక్కండి. తర్వాత మట్టిని పూడ్చండి. నీరు పోయండి.
  • దీనికోసం నెమ్మదిగా పడే నీటి కేన్‌ వాడాలి. మొక్కలు ఎదిగేందుకు నీరే ప్రధానం. ఎండాకాలం చాలా నీరు పోయాలి. రెండు పూటలా నీరు పోయాలి. అప్పుడే విత్తనాలు త్వరగా ఎదుగుతాయి.
  • కంపోస్టు ఎరువును కుండీల్లో వాడితే మంచిది. అది పోషకాలను ఇస్తుంది.
  • విత్తనాలను నాటిన తర్వాత కుండీని వీలైనంత వరకు నీడలోనే పెట్టాలి. ఎండ ప్రభావం ఎక్కువగా పడితే మొక్కలు తట్టుకోలేవు.
  • 2–3 వారాల్లో మొక్కలు పెరుగుతాయి. ఇతర మొక్కలు ఏవైనా పెరిగితే తొలగించండి. లేదంటే అవి మొక్క ఎదుగుదలను అడ్డుకుంటాయి.
  • ఒక్కసారి మొక్క రావడం మొదలైతే బెండకాయలు కాసేవరకూ పెరుగుతూనే ఉంటుంది. మొక్క పెరుగుదలకు రోజువారీ జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఇంట్లోనే మీకు తాజా బెండకాయలు లభిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version