కరోనా వైరస్ ఉండటం తో దేశ వ్యాప్తంగా బంగారం డిమాండ్ భారీగా పెరిగింది. దక్షిణ భారత దేశంలో కూడా బంగారం కొనుగోలు భారీగా పడిపోయింది. అయినా సరే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం కూడా హైదరాబాద్ లో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్లు పది గ్రాములకు 1010 రూపాయలకు పెరిగింది. 41,850 రూపాయలుగా ఉంది బంగారం ధర.
24 క్యారెట్ల బంగారం ధర 1150 రూపాయల భారీగా పెరిగింది. దీనితో 45,550 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్లకు 1010 రూపాయలకు చేరుకుంది. దీనితో 41,850 రూపాయలకు చేరుకుంది బంగారం. 24 క్యారెట్ల బంగారం 1150 రూపాయల వరకు పెరిగింది. దీనితో… 45,550 రూపాయలకు బంగారం పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీ లో కూడా బంగారం పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 680 రూపాయలకు పెరిగింది. 45,800 రూపాయల వద్దకు చేరుకుంది బంగారం. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 420 రూపాయల పెరగడం తో 43,540 రూపాయలకు చేరుకుంది. కేజీ వెండి ధర 42 వేల మార్కుకు చేరువలో వచ్చింది. కేజీ వెండి ధర 41,960 రూపాయలు నమోదు చేసింది.