బిగ్ బ్రేకింగ్; లాక్ డౌన్ మార్గ దర్శకాలు విడుదల చేసిన కేంద్రం, వీటికి అనుమతి…!

-

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపధ్యంలో… కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు అనుమతి ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగ పనులకు స్వల్పంగా అనుమతి ఇచ్చింది. అయితే స్థానికంగా ఉన్న కార్మికులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. రాష్ట్రాల మధ్య అన్ని రవాణాలు బంద్ చేసింది. గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమల నిర్వహణకు అనుమతి ఇచ్చింది

కాఫీ తేయాకులో 50 శాతం మాన్ పవర్ కి అనుమతి ఇచ్చింది కేంద్రం. పట్టణ పరిధిలో లేని అన్ని రకాలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఏప్రిల్ 20 నుంచి అమలులోకి ఈ గైడ్ లైన్స్ రానున్నాయి. పబ్లిక్ లో కచ్చితంగా మాస్కులు ధరించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. నిత్యావసర సరుకుల రవాణా పూర్తిగా రాష్ట్రాల మధ్య నిలిపి వేసింది కేంద్ర ప్రభుత్వం,

మే 3 వరకు విమానాలు, రైళ్ళు, బస్సులను నిలిపి వెయ్యాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హాట్ స్పాట్ లో నిబంధనలను కఠిన తరం చెయ్యాలని నిర్ణయించింది. అన్ని రకాల ఈ కామర్స్ సర్వీసులకు అనుమతి ఇచ్చింది.హాట్ స్పాట్ లో జనసంచారం ఉండకూడదు అని కేంద్రం స్పష్టం చేసింది. పరిమితంగా నిర్మాణ రంగ పనులకు మాత్రమే అనుమతి ఇచ్చింది.

మత ప్రార్ధనలు దైవ కార్యక్రమాలు పూర్తిగా నిషేధం చేస్తూ తెలిపింది. ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ రవాణాపై ఆధారపడకుండా సొంత వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. పది మంది అంతకన్నా ఎక్కువ మంది ఉండకూడదు అని పేర్కొంది. వాహనాలు కార్మికులు విధులు నిర్వహించే సామాగ్రిని ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చెయ్యాలని స్పష్టం చేసింది. ఆఫీసుల్లో కనీసం ఒకరికొకరు ఆరు అడుగుల దూరం పాటించాలి అనిపెర్కొంది.

విధులు నిర్వహించే వారికి మెడికల్ ఇన్సురెన్స్ తప్పనిసరి చేసింది. సామాజిక దూరం పాటించే విధంగా ఉద్యోగులకు గంట పైగా విరామం ఇవ్వాలి అని చెప్పింది. లిక్కర్, గుట్కా అమ్మకాలపై నిషేధం కొనసాగుతుంది అని పేర్కొంది. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ లో శానిటైజర్ తప్పనిసరిగా ఉంచాలని స్పష్టం చేసింది. వాహనాల్లో 30 నుంచి 40 శాతం మంది మాత్రమే ఉండాలని తన మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news