తెలంగాణ రాజకీయాల్లో షర్మిల పార్టీ ప్రకటనతో ప్రకంపనలు మొదలయ్యాయనే చెప్పుకోవచ్చు. వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఘనంగా జరిగింది. షర్మిల పార్టీ ప్రకటన వచ్చినప్పటి నుండి ఒక మాట గట్టిగా వినిపిస్తుంది. అది షర్మిలతో ఎవరో కావాలనే పార్టీ పెట్టించారు అని. అది కేసీఆర్ అని చాలామంది నమ్ముతున్నారు. ఈ విషయమై ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది.
షర్మిలతో పార్టీ ఎవరు పెట్టించారనే నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్లు రవి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ బలపడుతుందన్న భావన ఉంది కాబట్టే ఓట్లు చీల్చడానికి షర్మిలతో పార్టీ పెట్టించారని మల్లు రవి అభిప్రాయపడ్డారు. దీనికి కౌంటర్ గా తెలంగాణ నాయకులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎప్పుడు ఎదిగింది? అన్ని సీట్లు కోల్పోయింసి కనిపిస్తూనే ఉంది కదా! ఎప్పుడు ఎదిగిందని తిరిగి ప్రశ్నించారు.