అంతరిక్షంలో తెలుగమ్మాయి.. ప్రయాణం ఈరోజే.

-

తెలుగమ్మాయి బండ్ల శిరీష అంతరిక్షంలోకి వెళ్ళనున్నారనే వార్త గత కొన్ని రోజుల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపడుతున్న అంతరిక్షయానంలో శిరీష బండ్ల కూడా ఉన్నారు. మొత్తం నలుగురు ప్రయాణీకులతో రోదసి నౌక అంతరిక్ష యానానికి సిద్ధమైంది. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాసన్ తో కలిసి ఈ ప్రయాణం మొదలు కానుంది. ఈ రోజు జరుగుతున్న ఈ ప్రయాణంలో అంతరిక్షంలోకి వెళ్తున్న మొట్ట మొదటి తెలుగమ్మాయిగా శిరీష బండ్ల పేరు తెచ్చుకోనుంది.

గుంటూరు వాసి అయిన శిరిష బండ్ల, అమెరికాలో స్థిరపడింది. తల్లిదండ్రులు అమెరికాలో నివాసం ఉండడంతో అక్కడే పుట్టి పెరిగిన శిరీష, వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో పనిచేస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ ప్రయాణం చేస్తుంది. భారతదేశానికి చెందిన వారిలో ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే అంతరిక్ష ప్రయాణం చేసారు. శిరీష బండ్ల నాలుగవ వ్యక్తిగా పేరు తెచ్చుకోనుంది. ఈ నలుగురిలో ముగ్గురు మహిళలు కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version