పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. ఇవాళ పెట్రోల్ లీటర్ కు 15 పైసలు తగ్గింది. డీజిల్ లీటర్ కు 10 పైసలు తగ్గింది. ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు చూసుకుంటే.. అంతర్జాతీయ మార్కెట్ లో వాటి ధరలు స్థిరంగా ఉన్నాయి.
న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 70.94 రూపాయలు ఉండగా.. డీజిల్ ధర రూ.65.71 గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర 76.57 గా ఉండగా.. డీజిల్ ధర 68.81 గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 75.26 గా ఉండగా.. డీజిల్ ధర 71.44 గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో పెట్రోల్ ధర 75.05 కాగా.. డీజిల్ ధర 70.84, కోల్ కతా లో పెట్రోల్ ధర 73.04, డీజిల్ ధర 67.49, చెన్నైలో పెట్రోల్ కు 73.64, డీజిల్ కు 69.41, బెంగళూరులో పెట్రోల్ ధర 73.28 కాగా.. డీజిల్ ధర 67.88 గా ఉంది.