పెరిగిన పసిడి ధరలు…! వెండి కూడా …!

-

హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి పెరిగాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర… 280 రూపాయలు పెరిగింది. దీనితో 40,430 రూపాయల వద్దకు చేరుకుంది. 24 క్యారెట్ల విషయానికి వస్తే పది గ్రాములకు 190 రూపాయల వరకు పెరగడంతో 44,100 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్ లో వెండి ధర కేజీ స్వల్పంగా పెరిగింది.

150 రూపాయలు పెరగడంతో 41 వేల మార్కు దాటింది వెండి. 41,150 రూపాయలకు కేజీ వెండి చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్ విషయానికి వస్తే… 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర… 280 రూపాయలు పెరిగింది. దీనితో 40,430 రూపాయలకు చేరుకుంది బంగారం. 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే పది గ్రాములకు 190 రూపాయలు పెరగడంతో… 44,100 రూపాయలకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 710 రూపాయలు పెరిగింది. దీనితో 44,970కు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే 280 రూపాయలు స్వల్పంగా పెరిగింది. దీనితో 42,570 రూపాయలకు చేరుకుంది. కాగా బంగారం కొనుగోళ్ళు అసలు లేకపోవడం తో ఇది తగ్గినా పెరిగినా సామాన్యులకు పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news