బంగారం కొనుగోలు చేయాలనకునే వారికి ఇది శుభవార్తే. తాజాగా పెరుగుతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. దేశంలో 3-4 రోజుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు ఈ రోజు కాస్త బ్రేక్ పడింది. సోమవారం (జూన్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,740లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 10.. 24 క్యారెట్ల ధరపై కూడా రూ. 10 తగ్గింది.
మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 61,700గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,090గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,090గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,740గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,090 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,740.. 24 క్యారెట్ల ధర రూ. 52,090గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 47,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,090గా ఉంది.